AP News: విశాఖ రైల్వేజోన్‌ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం: అశ్విని వైష్ణవ్‌

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను వైకాపా ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి శుక్రవారం దిల్లీలో కలిశారు. రైల్వే జోన్‌ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోందని

Updated : 11 Dec 2021 16:33 IST

దిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను వైకాపా ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి శుక్రవారం దిల్లీలో కలిశారు. రైల్వే జోన్‌ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎంపీలు.. కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ .. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. జోన్‌ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు.

విశాఖ రైల్వే జోన్‌పై వైకాపా ఎంపీలు లోక్‌సభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గురువారం శూన్యగంటలో ఈ అంశంపై అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌లు వేర్వేరు సమయాల్లో మాట్లాడారు. జోన్‌ మంజూరు చేయడంతోపాటు, దానికి రూ.300 కోట్లు కేటాయించినందుకు సత్యవతి ధన్యవాదాలు తెలపగా.. అసలు జోన్‌ అమల్లోకి వస్తుందా? రాదా? అన్న అమోయయం రాష్ట్ర ప్రజల్లో నెలకొందని భరత్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని