Telangana News: కమీషన్లు రావనే ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టారా?: కోదండరామ్‌

కృష్ణా నదీ జలాల పరిరక్షణ యాత్ర ఉదయసముద్రం పానగల్‌ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ తెలిపారు. కేంద్ర గెజిట్‌తో తెలంగాణకు

Updated : 04 May 2022 16:28 IST

హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల పరిరక్షణ యాత్ర ఉదయసముద్రం పానగల్‌ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ తెలిపారు. కేంద్ర గెజిట్‌తో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కోదండరామ్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘గెజిట్‌లో ప్రాజెక్టులపై సంపూర్ణ అధికారం ఉంటుంది అని ఉంది. దీంతో నదీ జలాలపై  రాష్ట్ర హక్కులు పోతాయి. ఇప్పటికే మనం సరైన వాటా వినియోగించుకోవడం లేదు. రాష్ట్రంలో తలపెట్టిన అన్ని ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. గెజిట్ అమలైతే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉండదు. శాశ్వతంగా కృష్ణా జలాలపై హక్కును కోల్పోయే అవకాశం ఉంది. జలాల హక్కుల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదు.

కాళేశ్వరం.. ప్రగతి భవన్.. సచివాలయం పూర్తి అయ్యాయి. నల్లగొండ.. పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావు.కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కమీషన్లు రావనే ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టారా? వడ్ల కోసం దిల్లీలో ధర్నా చేసిన మీరు.. కృష్ణా జలాల వినియోగంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నల్గొండ, మహబూబ్‌నగర్‌లు ఎడారిగా మారతాయి. కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను ఉపసంహరించుకోవాలి. ఆరు రోజుల పాటు సాగే కృష్ణా నదీ జలాల పరిరక్షణ యాత్ర నక్కలగండి ప్రాజెక్టు వద్ద ముగుస్తుంది’’ అని కోదండరామ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని