Chandrababu arrest: చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదు: కేంద్రమంత్రి గడ్కరీ

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తప్పు చేసే వ్యక్తి కాదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.

Published : 21 Sep 2023 15:55 IST

దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. గురువారం పార్లమెంట్‌ వద్ద  తెదేపా ఎంపీ కేశినేని నానితో మాట్లాడిన గడ్కరీ.. చంద్రబాబు యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ‘‘చంద్రబాబు మచ్చలేని ప్రజా సేవకుడు. భగవంతుని ఆశీస్సులతో కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడతారు’’ అని గడ్కరీ చెప్పినట్టు కేశినేని నాని ట్వీట్‌ చేశారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని