Varun Gandhi: రాత్రిపూట కర్ఫ్యూ.. పగటిపూట ర్యాలీలు.. వరుణ్‌ గాంధీ మరో ట్వీట్‌

సాగు చట్టాల విషయంలో గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు చేస్తోన్న భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో

Updated : 27 Dec 2021 15:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాగు చట్టాల విషయంలో గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు చేస్తోన్న భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం జరుగుతుండటంపై ఆయన తాజాగా ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఓవైపు రాత్రిపూట కర్ఫ్యూ విధించి.. పగలు మాత్రం ర్యాలీలు చేపడుతున్నారంటూ పరోక్షంగా భాజపాపై విమర్శలు గుప్పించారు. 

‘‘రాత్రిపూట కర్ఫ్యూ విధించడం.. పగలేమో ర్యాలీలకు లక్షల మందిని పిలవడం.. సామన్య ప్రజలకు ఎంతకీ అంతుపట్టని విషయమిది. ఉత్తరప్రదేశ్‌లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మనమంతా దృష్టిలో ఉంచుకోవాలి. ఒమిక్రాన్‌ వ్యాప్తిని అడ్డుకోవడమా.. లేదా ఎన్నికల ప్రచార శక్తిని ప్రదర్శించడమా.. ఈ రెండింట్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనేది నిజాయతీగా నిర్ణయించుకోవాలి’’ అని వరుణ్‌ గాంధీ ట్విటర్‌లో రాసుకొచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అక్కడ ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ ర్యాలీలకు పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. మరోవైపు యూపీలో ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల యోగి సర్కారు డిసెంబరు 25 నుంచి రాత్రి కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో వరుణ్‌ గాంధీ చేసిన ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని