Vijayashanthi: భాజపాకు విజయశాంతి రాజీనామా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సినీనటి విజయశాంతి భాజపాకు షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Updated : 05 Mar 2024 16:07 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సినీనటి విజయశాంతి భాజపాకు షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి పంపించారు. ఎల్లుండి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2020లో విజయశాంతి భాజపాలో చేరిన విషయం తెలిసిందే.

విజయశాంతి త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారంటూ ఇటీవల సీనియర్‌నేత మల్లు రవి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. నేడో, రేపో ఆమె కాంగ్రెస్‌ గూటికి వస్తారన్నారు. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో గత కొన్ని రోజులుగా విజయశాంతి పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే భాజపా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరగా.. ఇప్పుడు రాములమ్మ సైతం వారి బాటలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని