Deve Gowda : కావేరి జల వివాదంపై అవసరమైతే ప్రధానితో మాట్లాడతా : దేవెగౌడ

కావేరి జల వివాదం (Cauvery issue) పరిష్కారం కోసం అవసరమైతే తాను ప్రధానిని కలిసి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ ప్రధాని దేవెగౌడ (H.D. Deve Gowda) వ్యాఖ్యానించారు.  

Published : 03 Sep 2023 22:40 IST

బెంగళూరు : కావేరి జల వివాదాన్ని (Cauvery issue) పరిష్కరించేందుకు అవసరమైతే తాను ప్రధాని నరేంద్రమోదీని (Narendra modi) కలిసి మాట్లాడతానని మాజీ ప్రధాని దేవెగౌడ (H.D. Deve Gowda) అన్నారు. హాసన్‌ సమీపంలోని బైలహల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కావేరి గురించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తన కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి ఇది వరకే చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. జేడీఎస్‌ వైఖరి స్పష్టమైనందువల్ల ప్రస్తుతం ఆ విషయం గురించి తాను మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఈ అంశంపై అవసరమైతే ప్రధానిని కలిసి చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జలవనరుల మంత్రిత్వశాఖ వ్యవహారాలు చూస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆ శాఖకు సంబంధించిన విషయాలు బయటకి చెప్పొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని దేవెగౌడ ఆరోపించారు. జలాశయాల్లో కనీసం నీటిమట్టం ఎంత ఉందో కూడా తెలుసుకునే అవకాశం ఇవ్వట్లేదని విమర్శించారు. మంత్రి నుంచి ఆదేశాలు ఉన్నందునే అధికారులు సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారన్నారు. 

ఈ సంచలన నిర్ణయం తీసుకునే ముందు ప్రతిపక్షాలతో చర్చించాల్సింది : అశోక్‌ గహ్లోత్

ఇటీవల 28 పార్టీల ‘ఇండియా’ కూటమి మూడో సమావేశం ముంబయిలో జరిగింది. ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ‘వారు ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించారా? కూటమికి కన్వీనర్‌ను నియమించారా? పొత్తులో భాగంగా సీట్ల పంపకం గురించి చర్చించారా?’ అని ప్రశ్నించారు. కర్ణాటకలో జేడీఎస్‌.. భాజపాతో అవగాహన కుదర్చుకుందనే వార్తలను దేవెగౌడ తోసిపుచ్చారు. భాజపా ఇంతవరకు అసెంబ్లీలో విపక్ష నేతనే నియమించుకోలేదనే విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి సమయంలో తాము ఎవరితో చర్చలు జరుపుతామని ప్రశ్నించారు. భాజపా నేతల్లోనే సఖ్యత లేనప్పుడు.. భాజపా, జేడీఎస్‌ కలిసే ఉన్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించడంలో అర్థమే లేదని దేవెగౌడ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు