YS Sharmila: జగన్‌ను ఇకపై అలానే పిలుస్తా: వైఎస్‌ షర్మిల

తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామంటూ వైకాపా సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాల్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పందించారు.

Updated : 23 Jan 2024 14:01 IST

ఇచ్ఛాపురం: తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామంటూ వైకాపా సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాల్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పందించారు. అభివృద్ధిని చూసేందుకు తాను సిద్ధమని.. తేదీ, సమయం చెప్పాలని ఛాలెంజ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో వివిధ అంశాలపై ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం బస్సులోనే మీడియాతో ఆమె మాట్లాడారు. సీఎంను తాను జగన్‌రెడ్డి అంటే సుబ్బారెడ్డికి నచ్చడం లేదన్నారు. ఇకపై ఆయన్ను అన్న గారు అనే అంటానని వ్యాఖ్యానించారు. 

‘‘సుబ్బారెడ్డి గారూ.. మీ సవాల్‌ను స్వీకరిస్తున్నా. మీరు చేసిన అభివృద్ధిని చూపించండి. దానిని చూసేందుకు నేను సిద్ధం. తేదీ, సమయం మీరు చెప్పండి.. లేదంటే నేను చెబుతా. అభివృద్ధి పరిశీలనకు మేధావులను కూడా పిలుద్దాం. నాతో పాటు మీడియా, ప్రతిపక్షాలు కూడా వస్తాయి. చేసిన అభివృద్ధి ఏంటో అందరికీ చూపించండి. మీరు చెప్పిన రాజధానులు ఎక్కడ?కడతామన్న పోలవరం ప్రాజెక్టు ఎక్కడ?’’ అని షర్మిల నిలదీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని