
TS News: తాడిపర్తిలో షర్మిల ‘నిరుద్యోగ దీక్ష’
గోపాలపేట: తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సీఎం కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నారని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిరసిస్తూ వనపర్తి జిల్లా తాడిపర్తి బస్టాండులో ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో 54లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో 1.9లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలేదని చెప్పారు. ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగుల దినంగా పాటించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ జరిగేంతవరకు తమ పోరాటం ఆగదన్నారు.
దీక్ష ప్రారంభానికి ముందు తాడిపర్తిలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొండల్ (30) కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. మృతుడి తల్లిదండ్రులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఆమె కొంత ఆర్థికసాయం అందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.