YS Sharmila: ‘హోదా’పై మాట్లాడుతూ షర్మిల భావోద్వేగం

వ్యక్తిగత కారణాల వల్ల తాను ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు.

Updated : 07 Mar 2024 15:07 IST

అమరావతి: వ్యక్తిగత కారణాల వల్ల తాను ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. అలా అనుకుంటే 2019లోనే ఇక్కడ అడుగు పెట్టేదాన్ని అని వ్యాఖ్యానించారు. మంగళగిరిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదన్నారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. ఈ విషయంలో తల్లి లాంటి ఏపీని జగన్‌ వెన్నుపోటు పొడిచారు. ప్రతిపక్ష నేతగా నిరాహార దీక్షలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్నారు. సీఎం అయ్యాక ఆ పార్టీ నుంచి ఒక్కరైనా రాజీనామా చేశారా? ఒక్కటైనా నిజమైన పోరాటం చేశారా? హోదా మన బిడ్దల హక్కు.. దీన్ని ఎంతమంది పట్టించుకున్నారు? అది వచ్చి ఉంటే రాజధాని, పోలవరం మనం కట్టుకోలేమా? మన రాష్ట్రం ఎందుకు తక్కువగా ఉండాలి. ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్‌ గాంధీ. ఆయన మాటతోనే నేను ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టా’’ అని షర్మిల అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని