
Updated : 10 Jan 2022 15:53 IST
Ap News: నర్సాపురం వెళ్తున్నా.. రెండు రోజులు అక్కడే ఉంటాను: రఘురామకృష్ణరాజు
దిల్లీ: ఫిబ్రవరి 5 వరకు తనపై అనర్హత వేటు వేయించడానికి వైకాపాకు అవకాశం ఇస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉందని.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. తాను గెలిస్తే మాత్రం సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న నర్సాపురం వెళ్తున్నానని.. రెండు రోజులు అక్కడే ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రెండు రోజులు పోలీసులు తనకు భద్రత కల్పించాలన్నారు. అమరావతి కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రఘురామ తెలిపారు.
ఇవీ చదవండి
Tags :