Raghurama: పంతాలు పక్కనపెట్టాలి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సీఎం

Published : 24 Jun 2021 15:31 IST

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణను ప్రస్తావిస్తూ లేఖలో పేర్కొన్నారు. పరీక్షల రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. పంతాలు, పట్టింపులు పక్కనపెట్టి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలన్నారు.

‘‘రాష్ట్రంలో కరోనా అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపటం బాధాకరం. డెల్టా వేరియంట్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పడం శోచనీయం. పరీక్షలను నిర్వహించడమంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుంది. పక్కా ప్రణాళిక లేకుండా మొండితనంతో పరీక్షలు నిర్వహించాలనుకోవడం సరైంది కాదు. పరీక్షలు నిర్వహించడం ద్వారా జరగరాని నష్టం జరిగితే సరిదిద్దుకోలేని తప్పు చేసినట్లు అవుతుంది. ఇప్పటికే 18 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. ఆ రాష్ట్రాల బాటలో పయనిస్తే విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడినవారు అవుతారు. సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని పరీక్షల నిర్వహణపై సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని