దంచికొట్టిన త్రిపాఠి: చెన్నై లక్ష్యం 168

చెన్నైతో జరుగుతున్న మ్యాచులో కోల్‌కతా ఫర్వాలేదనిపించింది. ప్రత్యర్థికి 168 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఆ జట్టు ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (81; 51 బంతుల్లో 8×4, 3×6) వీర విహారం చేశాడు. మొన్నటి వరకు లోయర్‌...

Published : 07 Oct 2020 21:44 IST

అబుదాబి: చెన్నైతో జరుగుతున్న మ్యాచులో కోల్‌కతా ఫర్వాలేదనిపించింది. ప్రత్యర్థికి 168 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఆ జట్టు ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (81; 51 బంతుల్లో 8×4, 3×6) వీర విహారం చేశాడు. మొన్నటి వరకు లోయర్‌ ఆర్డర్‌లో ఆడిన అతడిని ఈ సారి ఓపెనర్‌గా పంపించడం విశేషం. తనకిష్టమైన ఓపెనింగ్‌ స్థానంలో అతడు అదరగొట్టాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడుతూ జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు.

త్రిపాఠి రాణించినప్పటికీ మిగతా ఆటగాళ్ల నుంచి అతడికి మద్దతు దక్కలేదు. లేదంటే ఆ జట్టు భారీ స్కోరు చేసేది. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ (11) జట్టు స్కోరు 37 వద్దే ఔటయ్యాడు. ఆ తర్వాత నితీశ్‌రాణా (9), సునిల్‌ నరైన్‌(17), ఇయాన్‌ మోర్గాన్‌ (7), ఆండ్రి రసెల్‌ (2) వరుసగా పెవిలియన్‌కు చేరుకున్నారు. చివర్లో కమిన్స్‌ (17*), దినేశ్‌ కార్తీక్‌ (12) కాసిన్ని పరుగులు చేయడంతో కోల్‌కతా 167 స్కోరైనా చేయగలిగింది. చెన్నై బౌలర్లలో డ్వేన్‌ బ్రావో మూడు వికెట్లు తీశాడు. కర్ణ్‌ శర్మ (2), శార్దూల్‌ ఠాకూర్‌ (2), సామ్‌ కరణ్‌ (2) ఫర్వాలేదనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు