మరీ అంత నెమ్మదస్తుడ్ని కాదు: గిల్

ఆస్ట్రేలియా కవ్వింపులకు సిద్ధంగా ఉన్నామని, ప్రత్యర్థులు సంధించే బౌన్సర్లకు సమాధానాలు ఉన్నాయని టీమిండియా యువఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ అన్నాడు. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన డే/నైట్...

Published : 14 Dec 2020 20:25 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా కవ్వింపులకు సిద్ధంగా ఉన్నామని, ప్రత్యర్థులు సంధించే బౌన్సర్లకు సమాధానాలు ఉన్నాయని టీమిండియా యువఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ అన్నాడు. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన డే/నైట్ సన్నాహక మ్యాచ్‌లో 43, 65 పరుగులతో గిల్‌ రాణించిన సంగతి తెలిసిందే. దీంతో తుదిజట్టులో అతడి స్థానం ఖరారైనట్లే అని భావిస్తున్నారంతా. అయితే కంగారూల గడ్డపై ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవడం అంత తేలికైనా విషయం కాదని గిల్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అధికారిక వైబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో అతడు కోల్‌కతా తరఫున ఆడిన సంగతి తెలిసిందే.

‘‘ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే భయపడే విషయమే. అయితే ఆ సవాళ్లను అధిగమించడానికి సిద్ధంగా ఉన్నా. బ్యాట్స్‌మెన్‌కు తనపై తనకి విశ్వాసం మరింత పెరగాలంటే కంగారూల గడ్డపై రాణించడం కంటే మరో గొప్ప విషయం ఉండదు. అయితే ఒకప్పుడు భారత ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా ఉండేవారు కాదని అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్ని మారిపోయాయి. కొందరు కవ్వింపులకు సమాధానం ఇవ్వరు. మరికొందరు దీటుగా బదులిస్తుంటారు. నా వరకు నేను అంత నెమ్మదస్తుడిని కాదు. అలా అని ప్రత్యర్థులపై దూకుడుగా వ్యవహరించే వ్కక్తిత్వం కాదు’’ అని గిల్ అన్నాడు.

భారత బ్యాట్స్‌మెన్‌ను బౌన్సర్లతో బోల్తా కొట్టిస్తామని ఇటీవల ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై గిల్‌ స్పందిస్తూ.. ‘‘చిన్‌ మ్యూజిక్‌ ప్రణాళికతో మమ్మల్ని ఔట్ చేయడానికి ఆసీస్ ఆటగాళ్లు ప్రయత్నించవచ్చు. అయితే వాటికి మా వద్ద సమాధానాలు ఉన్నాయి’’ అని అన్నాడు. క్రికెట్ భాషలో బ్యాట్స్‌మెన్‌ దవడ, మెడను లక్ష్యంగా చేస్తూ బంతులు విసరడాన్ని చిన్‌ మ్యూజిక్ అంటారు. కాగా, ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌ డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా తొలి డే/నైట్ టెస్టు ఆడనుంది.

ఇదీ చదవండి

బ్యాట్‌తో చుక్కలు.. బంతితో నిప్పులు

కోహ్లీసేన ‘క్రికెట్‌ బుర్ర’ మిస్‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని