గిల్‌ను కెప్టెన్ చేయాలి: పీటర్సన్
కోల్‌కతా బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కు ఆ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ గిల్లో ఉన్నాయని అన్నాడు. శనివారం హైదరాబాద్‌తో జరిగిన..
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కు ఆ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ గిల్లో ఉన్నాయని అన్నాడు. శనివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడి అందర్నీ మెప్పించాడు. నిర్దేశిత 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది కోల్‌కతా. గిల్ 70(62బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశాడు. మోర్గాన్(42)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో గిల్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. భారత్ అండర్19 ప్రంపచకప్ గెలవడంలోనూ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే అతని బ్యాటింగ్‌తో భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉందన్న నమ్మకం కలిగించాడు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్న దినేశ్ కార్తీక్ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయాడు. కెప్టెన్‌గానూ ఆశించన ఫలితాలు ఇవ్వడం లేదు. జట్టులో మేటి ఆటగాళ్లున్నప్పటికీ ప్లేఆఫ్స్ దాటించలేకపోతున్నాడు. గతేడాది అయితే లీగ్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టంది. దీంతో యువ ఆటగాడు గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్‌పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ