Anushka-Sakhsi: హార్దిక్‌ పోస్టుకు స్పందన

బాలీవుడ్‌ నటీమణి అనుష్క శర్మ, ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షిసింగ్‌ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. అటు క్రికెటర్లు.. ఇటు నటీనటులు పెట్టే...

Published : 19 May 2021 00:06 IST

బాలీవుడ్‌ నటీమణి అనుష్క శర్మ, ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షిసింగ్‌ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. అటు క్రికెటర్లు.. ఇటు నటీనటులు పెట్టే పోస్టులకు వెంటనే స్పందిస్తుంటారు. తాజాగా హార్దిక్‌ పాండ్య పెట్టిన పోస్టుకు వీరిద్దరూ కామెంట్‌ చేయడం గమనార్హం.

యువ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య, అతడి సతీమణి నటాషా స్టాంకోవిచ్‌ సోషల్‌ మీడియాలో తమ వ్యక్తిగత, కుటుంబఅంశాలను పంచుకొనే సంగతి తెలిసిందే. హార్దిక్ ఎన్నోసార్లు తన భార్యపై ప్రేమను కురిపిస్తూ పోస్టులు పెడుతుంటాడు. అలాగే తన కుమారుడు అగస్త్య విశేషాలను పంచుకుంటాడు. ఈ మధ్యే తన కుమారుడితో కలిసి నడుస్తున్న వీడియోను పాండ్య ఇన్‌స్టాలో పంచుకున్నాడు. వారిద్దరూ నడుస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ‘హెవీ బేబీ’ టైటిల్‌  ట్రాక్‌ వస్తోంది.

ఈ పోస్టుకు అనుష్క, సాక్షి స్పందించారు. అనుష్క వంకాయ రంగు హృదయాకార ఎమోజీలతో బదులిచ్చింది. సాక్షి సైతం హృదయాకార ఎమోజీలతోనే కామెంట్‌ చేసింది. కాగా వీరిద్దరూ చిన్ననాటి నుంచే మిత్రులని తెలియడంతో నెటిజన్లు అవాక్కైన సంగతి తెలిసిందే. 1994 నుంచి వీరిద్దరూ అస్సాంలోని సెయింట్‌ మేరీస్‌ పాఠశాలలో చదువుకున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని