IPL 2024 Auction: ఐపీఎల్ వేలం.. ఏ ఆటగాడికి ఎంత ధర.. అశ్విన్‌ అంచనా ఇలా

ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్‌ కోసం డిసెంబరు 19న దుబాయ్‌ వేదికగా మినీ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో ఏ ఏ ఆటగాళ్లు భారీ ధర దక్కించుకునే అవకాశముందో భారత స్పిన్నర్ అశ్విన్ అంచనా వేశాడు.

Published : 18 Dec 2023 02:09 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్‌ కోసం డిసెంబరు 19న దుబాయ్‌ వేదికగా మినీ వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ వేలంలో మొత్తం 333 మంది అమ్మకానికి ఉండగా.. 77 ఖాళీలు ఉన్నాయి. 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్‌ దేశాల నుంచి ఇద్దరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ వేలంలో ప్రధాన ఆటగాళ్లు ఎంత ధర పలికే అవకాశం ఉందో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అంచనా వేశాడు. అశ్విన్ వినూత్నంగా క్రికెట్ షాట్ల ఆధారంగా ప్రైస్‌ రేంజ్‌ని విభజించాడు. డిఫెన్స్‌ (రూ. 2 కోట్ల నుంచి రూ.4 కోట్లు), డ్రైవ్ (రూ.4 కోట్ల నుంచి రూ.7 కోట్లు), ఫుల్ (రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్లు), స్లాగ్ (రూ.10 కోట్ల నుంచి రూ.14 కోట్లు), హెలికాప్టర్ షాట్ (రూ.14 కోట్ల కంటే ఎక్కువ)గా ఆటగాళ్లను రేంజ్‌ని డిసైడ్‌ చేశాడు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్‌, పాట్ కమిన్స్‌ అత్యధిక ధర దక్కించుకుంటారని అశ్విన్ అంచనా వేశాడు. 

అశ్విన్ అంచనా వేసిన ఆటగాళ్ల ధరలు

  • ట్రావిస్ హెడ్ (రూ.2 కోట్లు-4 రూ.4 కోట్లు)
  • రచిన్‌ రవీంద్ర (రూ.4 కోట్లు- రూ. 7 కోట్లు) 
  • హర్షల్ పటేల్ (రూ.7 కోట్లు- 10 కోట్లు)
  • వానిందు హసరంగ (రూ.10 కోట్లు- 14 కోట్లు)
  • రోమ్‌మన్‌ పావెల్ (రూ.4 కోట్లు- 7 కోట్లు)
  • ఉమేశ్‌ యాదవ్ (రూ.4 కోట్లు- 7 కోట్లు)
  • షారూక్‌ ఖాన్ (రూ.10 కోట్లు- 14 కోట్లు)
  • గెరాల్డ్ కొయెట్జీ (రూ.7 కోట్లు- 10 కోట్లు)
  • పాట్ కమిన్స్‌ (రూ.10 కోట్లు- 14 కోట్ల కంటే ఎక్కువ)
  • మిచెల్ స్టార్క్‌ (రూ.14 కోట్ల కంటే ఎక్కువ)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని