IND vs AUS: కొండంత లక్ష్యం ఉఫ్‌.. తొలి టీ20లో ఆస్ట్రేలియా విజయం

భారత్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

Updated : 20 Sep 2022 23:20 IST

మొహాలి: భారత్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. గ్రీన్‌ (61) అర్ధశతకం చేయగా.. స్టీవెన్‌ స్మిత్‌ (35), వేడ్‌ (45 నాటౌట్‌) రాణించారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో మ్యాచ్‌ అక్టోబర్ 23 (శుక్రవారం) నాగ్‌పుర్‌ వేదికగా జరగనుంది.

పాండ్య విజృంభణ.. 

టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించడానికి ప్రధాన కారణం ముగ్గురు.. స్వల్ప వ్యవధిలో ఓపెనర్ రోహిత్ శర్మ (11)తోపాటు విరాట్ కోహ్లీ (2) ఔటైనప్పటికీ ఈ ఒత్తిడి భారత్ మీద పడనీయకుండా కేఎల్ రాహుల్ (55), సూర్యకుమార్‌ యాదవ్ (46) చక్కగా ఆడారు. వీరిద్దరూ కలిసి 68 పరుగులు జోడించారు. అయితే మరోసారి భారత శిబిరంలో అలజడి రేగింది. రాహుల్, సూర్యకుమార్‌, అక్షర్‌ పటేల్ (6), దినేశ్‌ కార్తిక్ (6) పెవిలియన్‌కు చేరారు. అయినప్పటికీ టీమ్‌ఇండియా స్కోరు 200 దాటిందంటే కారణం హార్దిక్‌ పాండ్య (71). ఓ పక్క వికెట్లు పడినా.. దూకుడు మాత్రం తగ్గించలేదు. ఆఖర్లో మరీ భీకరంగా ఆడేశాడు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, హేజిల్‌వుడ్ 2, గ్రీన్‌ ఒక వికెట్ తీశారు.

200 చేసినా కష్టమే..!

మేం బాగా బౌలింగ్‌ చేశామని అనుకోవడం లేదు. ఇక్కడ 200 పరుగులను డిఫెండ్‌ చేయొచ్చు. అయితే ఫీల్డింగ్‌లో మాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. మా బ్యాటర్లు చాలా చక్కగా బ్యాటింగ్‌ చేశారు. హార్దిక్‌ అద్భుతంగా ఆడాడు. అయితే బౌలర్లు కాస్త వెనకబడ్డారు. ఇలాంటి మైదానాల్లో ఆడేటప్పుడు రెండొందలు అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే. మా బౌలింగ్ విభాగాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని