CSK vs DC: దిల్లీని పడగొట్టి.. ప్లేఆఫ్స్‌కు చెన్నై

చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సూపర్‌ విక్టరీతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ బెర్తుని ఖరారు చేసుకుంది.

Updated : 20 May 2023 19:50 IST

దిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సూపర్‌ విక్టరీతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. సీఎస్కే నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యఛేదనలో దిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. దిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (86; 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు. వార్నర్‌తో పాటు యశ్‌ ధుల్ (13), అక్షర్ పటేల్ (15) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. సీఎస్కే బౌలర్ల ధాటికి పృథ్వీ షా (5), ఫిలిప్‌ సాల్ట్‌ (3), రొసో (0), అమన్ ఖాన్ (7), లలిత్ యాదవ్ (6), నోకియా (0), కుల్‌దీప్‌ యాదవ్‌ (0) పెవిలియన్ బాటపట్టారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరణ 2, మహీశ్‌ తీక్షణ 2, రవీంద్ర జడేజా, తుషార్‌ దేశ్‌పాండే ఒక్కో వికెట్ పడగొట్టారు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై..  ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్ (79; 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), డేవాన్‌ కాన్వే (87; 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచి కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. చివర్లో శివమ్‌ దూబె (22; 9 బంతుల్లో 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (20*; 7 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్‌, నోకియా, చేతన్‌ సకారియా ఒక్కో వికెట్ పడగొట్టారు.

 ఏ ఓవర్‌లో ఏం జరిగింది..? ఓవర్‌ టు ఓవర్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని