INDw vs AUSw : కామన్వెల్త్‌ ఫైనల్‌.. ఆసీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు

కామన్వెల్త్‌ మహిళల క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు  ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగారు. టాస్‌ గెలిచిన...

Updated : 07 Aug 2022 23:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కామన్వెల్త్‌ మహిళల క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగారు. తొలుత టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 162 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ఓపెనర్‌ బెత్ మూనీ (61) అర్ధశతకం సాధించి కీలక పాత్ర పోషించింది. మెగ్‌ లానింగ్‌ (36), గార్డెనర్‌ (25) ధాటిగా ఆడి పరుగులు రాబట్టారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అలీసా హీలే 7, మెక్‌గ్రాత్ 2, గ్రేస్ హారిస్ 2, రేచల్ హేన్స్ 18* పరుగులు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 2, రేణుకా సింగ్ 2.. దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని