Dhoni: కోల్‌కతాతో మ్యాచ్‌లో.. ద్రవిడ్‌ రికార్డును తిరగరాసిన ధోనీ

చెన్నై కెప్టెన్‌గా బాధ్యతలు వదిలేసిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ధోని సత్తాచాటాడు...

Updated : 27 Mar 2022 10:35 IST

ముంబయి: చెన్నై కెప్టెన్‌గా బాధ్యతలు వదిలేసిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ధోని సత్తాచాటాడు. కోల్‌కతాతో పోరులో తనలోని బ్యాటర్‌ను తిరిగి బయటకు తీసి అజేయంగా 50 పరుగులు చేసిన అతడు..పెద్ద వయసులో అర్ధసెంచరీ సాధించిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 40 ఏళ్ల 262 రోజుల వయసులో అర్ధశతకం అందుకున్న ధోని.. రాహుల్‌ ద్రవిడ్‌ (40 ఏళ్ల 116 రోజులు)ను వెనక్కినెట్టాడు. దాదాపుగా మూడేళ్లలో ధోనికిదే తొలి అర్ధసెంచరీ. చివరగా అతను 2019, ఏప్రిల్‌ 21న అజేయంగా 84 పరుగులు చేశాడు. మొత్తంగా ఇది అతనికి 24వ అర్ధశతకం. ధోని ప్రదర్శనపై అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ‘‘తలా తిరిగొచ్చాడు’’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆల్‌టైమ్‌ దిగ్గజం ధోని అని కామెంట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు