Smriti Mandhana: ఆర్సీబీ కెప్టెన్‌గా స్మృతి

మార్చి 4న ఆరంభం కాబోతున్న తొలి మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన ఎంపికైంది.

Updated : 19 Feb 2023 06:55 IST

బెంగళూరు: మార్చి 4న ఆరంభం కాబోతున్న తొలి మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన ఎంపికైంది. ఇటీవల వేలంలో రూ.3.40 కోట్లు పెట్టి స్మృతిని దక్కించుకున్న ఆర్సీబీ.. కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. ఆ జట్టు స్టార్‌ విరాట్‌ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్‌ డుప్లెసిస్‌ సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని శనివారం ప్రకటించారు.

‘‘జెర్సీ నంబర్‌ 18.. స్మృతి మంధాన మహిళల ఐపీఎల్‌లో ఆర్సీబీని నడిపించనుంది. నీకు ప్రపంచంలోనే అత్యుత్తమ అభిమాన గణం మద్దతు ఉండబోతోంది’’ అని కోహ్లి అన్నాడు. ‘‘ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ ఓ గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. అభిమానుల నుంచి మద్దతు కోరుకుంటున్నా. వందశాతం జట్టు విజయానికి కృషి చేస్తా’’ అని స్మృతి చెప్పింది. భారత జట్టులో కీలక బ్యాటర్‌గా ఉన్న స్మృతి.. 11 టీ20ల్లో జట్టును నడిపించింది. మహిళల టీ20 ఛాలెంజ్‌ టోర్నీలో ట్రయల్‌బ్లేజర్స్‌ జట్టుకు కెప్టెన్సీ కూడా చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని