రెజ్లర్లతో అలాగేనా?
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రెజ్లర్లతో పోలీసులు వ్యవహరించిన తీరును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తప్పుబట్టింది.
పోలీసుల తీరుపై ఐఓసీ అభ్యంతరం
దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రెజ్లర్లతో పోలీసులు వ్యవహరించిన తీరును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తప్పుబట్టింది. దిల్లీలో నూతన పార్లమెంట్ ముందు మహా పంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళ్లిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకుని వారిని లాగి పడేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యుడబ్ల్యూడబ్ల్యూ) దీన్ని ఖండిస్తూ.. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించకపోతే డబ్ల్యూఎఫ్‌ఐపై సస్పెన్షన్ విధిస్తామని హెచ్చరించింది. ఇప్పుడు ఐఓసీ సైతం రెజ్లర్లతో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించింది. ‘‘గత వారాంతంలో భారత రెజ్లర్లకు జరిగింది చూసి కలత చెందాం. వారు చేస్తున్న ఆరోపణలపై స్థానిక చట్టాలను అనుసరించి నిష్పక్షపాత క్రిమినల్ విచారణ జరగాలని ఐఓసీ కోరుకుంటోంది. దాన్ని అనుసరించి తగు చర్యలూ ఉండాలి. ఈ క్రమంలో క్రీడాకారుల రక్షణకు ఢోకా లేకుండా చూడాలి’’ అని ఐఓసీ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijayawada: విద్యార్థుల అరెస్ట్.. రణరంగంగా మారిన ధర్నా చౌక్
-
Palak Gulia: సరదాగా మొదలుపెట్టి.. షూటింగ్లో స్వర్ణం నెగ్గి
-
45 గంటల బ్యాటరీ లైఫ్‌తో ₹1699కే నాయిస్ కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు ఇవే!
-
Chandrababu: చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సస్పెండ్
-
ODI WC 2023: హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. మేమంతా ఫిదా: పాక్ క్రికెటర్
-
Srinivas Goud: మోదీ క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలి: శ్రీనివాస్‌గౌడ్