Cricket News: అరుదైన రికార్డు.. 6 బంతుల్లో 6 వికెట్లు

ఆస్ట్రేలియా క్లబ్‌ క్రికెటర్‌ గారెత్‌ మోర్గాన్‌ 6 బంతుల్లో 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. గోల్డ్‌కోస్ట్‌ ప్రిమియర్‌ లీగ్‌ డివిజన్‌-3 టోర్నీలో నెరాంగ్‌ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్న మోర్గాన్‌... సర్ఫర్స్‌ పారడైజ్‌ సీసీపై ఈ ఘనత సాధించాడు.

Updated : 14 Nov 2023 09:35 IST

గోల్డ్‌కోస్ట్‌: ఆస్ట్రేలియా క్లబ్‌ క్రికెటర్‌ గారెత్‌ మోర్గాన్‌ 6 బంతుల్లో 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. గోల్డ్‌కోస్ట్‌ ప్రిమియర్‌ లీగ్‌ డివిజన్‌-3 టోర్నీలో నెరాంగ్‌ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్న మోర్గాన్‌... సర్ఫర్స్‌ పారడైజ్‌ సీసీపై ఈ ఘనత సాధించాడు. 40 ఓవర్ల మ్యాచ్‌లో 178 పరుగుల ఛేదనలో 39 ఓవర్లకు 174/4తో విజయానికి చేరువైన పారడైజ్‌ జట్టుకు గారెత్‌ (7/16) షాకిచ్చాడు. ఆఖరి ఓవర్లో 6 బంతులకు 6 వికెట్లు తీసి నెరాంగ్‌ క్లబ్‌ను గెలిపించాడు. ఈ 6 బంతుల్లో తొలి నాలుగు క్యాచ్‌లు, ఆ తర్వాత రెండు బౌల్డ్‌. ప్రొఫెషనల్‌ క్రికెట్లో ఒక ఓవర్లో అయిదు వికెట్లు తీసిన అభిమన్యు మిథున్‌ (భారత్‌, 2019), వాగ్నర్‌ (న్యూజిలాండ్‌, 2011), అమీన్‌ (బంగ్లాదేశ్‌, 2013)లను గారెత్‌ అధిగమించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని