Ravichandran Ashwin: రోహిత్‌కు నేర్పాల్సిన అవసరం లేదు: అశ్విన్‌

భారత కెప్టెన్‌ రోహిత్‌శర్మకు సెంచరీలు చేయడం నేర్పాల్సిన అవసరం లేదని స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ‘‘ప్రపంచకప్‌ ఫైనల్లో రోహిత్‌ క్రీజులో కొనసాగివుంటే సెంచరీ సాధించేవాడని చాలామంది అంటున్నారు.

Updated : 24 Nov 2023 06:43 IST
ముంబయి: భారత కెప్టెన్‌ రోహిత్‌శర్మకు సెంచరీలు చేయడం నేర్పాల్సిన అవసరం లేదని స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ‘‘ప్రపంచకప్‌ ఫైనల్లో రోహిత్‌ క్రీజులో కొనసాగివుంటే సెంచరీ సాధించేవాడని చాలామంది అంటున్నారు. కాని జట్టు కోసం అతను అలా ఆడాడు. రోహిత్‌కు సెంచరీలు చేయడం నేర్పించాల్సిన అవసరం లేదు. అతని ఖాతాలో చాలా ఉన్నాయి. ఫైనల్లో ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడింది. వారి వ్యూహాలు చూసి షాకయ్యా’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు. టాస్‌ గెలిచి ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ తీసుకోవడంపై మాట్లాడుతూ.. ‘‘టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ తీసుకుంటామని వాళ్లన్నారు. కానీ అందుకు భిన్నంగా ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. అలా ఎందుకు చేశారని ఆ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌ బెయిలీని ప్రశ్నించా. అందుకు అతడు స్పందిస్తూ.. ఇక్కడ ఎర్ర మట్టి పిచ్‌పై మంచు ప్రభావం ఎక్కువ ఉండదు. నల్ల మట్టి పిచ్‌పై ఉంటుంది. మధ్యాహ్నం స్పిన్‌కు సహకరించే ఈ పిచ్‌పై రాత్రి బ్యాటింగ్‌ చేయడం తేలిక అన్నాడు. ఆస్ట్రేలియా బృందం పిచ్‌పై కచ్చితమైన అహగాహనకు రావడానికి కారణం ఐపీఎల్‌యే’’ అని వివరించాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని