Hardik Pandya: హార్దిక్ పాండ్య టీ20 ప్రపంచకప్‌లో అలా ఆడాలి: వీరేంద్ర సెహ్వాగ్‌

రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. జట్టులో ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు. కొన్నాళ్ల క్రితం హార్దిక్‌ వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటినుంచి బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు.

Published : 01 Oct 2021 01:54 IST

 

(Photo:Hardik Pandya Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. జట్టులో ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు. కొన్నాళ్ల క్రితం హార్దిక్‌ వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటినుంచి బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున కూడా బౌలింగ్‌ చేయడం లేదు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ స్పందించాడు. హార్దిక్ ఇప్పటికీ బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేడు.. కాబట్టి టీ20 ప్రపంచకప్‌లో అతడు పూర్తిస్థాయి బ్యాటర్‌గా ఆడాలని చెప్పాడు. పాండ్య తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థుడని పేర్కొన్నాడు.

‘హార్దిక్ పాండ్య మొదట బ్యాట్స్‌మన్‌. బౌలింగ్‌ చేయడం అనేది కేవలం బోనస్. అతను ఇప్పటికీ బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేడు. బ్యాట్‌తో మ్యాచ్‌లను గెలిపించగలడు. టీ20 ప్రపంచకప్‌లో పూర్తిస్థాయి బ్యాటర్‌గా బరిలోకి దిగాలి. అలాంటి ఆటగాడు ఎల్లప్పుడూ నా జట్టులో ఉంటాడు’ అని సెహ్వాగ్‌ అన్నాడు.

భారత మాజీ క్రికెటర్ అజయ్‌ జడేజా కూడా పాండ్య గురించి మాట్లాడాడు. ‘హార్దిక్‌ను ముందుగా బ్యాట్స్‌మన్‌గా చూడాలి. బ్యాట్స్‌మెన్‌ ఎదగాలంటే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపించాలి. ప్రస్తుతం అతను ముందుగా వచ్చి నిరూపించుకున్నాడు. మధ్య ఓవర్లలో చాలా బాగా ఆడగల నైపుణ్యం ఉంది. ముంబయి ఇండియన్స్‌ అతడిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా పంపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది’అని అజయ్‌ జడేజా అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని