DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!

మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి హయాంలో టీమ్‌ఇండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది.ఆసీస్‌, ఇంగ్లాండ్‌పై అద్భుతాలను సృష్టించింది. ఆటగాళ్లకు కావాల్సినంత...

Published : 18 Aug 2022 02:12 IST

మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిపై డీకే వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్‌: మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి హయాంలో టీమ్‌ఇండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. ఆసీస్‌, ఇంగ్లాండ్‌పై అద్భుతాలను సృష్టించింది. ఆటగాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చి ఫలితాలను రాబట్టేవాడని మంచి పేరుంది. అయితే గెలిచినప్పుడు ఎంత సంబరపడతాడో.. ఉత్కంఠపోరులో ఓడితే మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేసేవాడని టీమ్‌ఇండియా సీనియర్‌ క్రికెటర్ దినేశ్‌ కార్తిక్‌ పేర్కొన్నాడు. రవిశాస్త్రికి  కాస్త సహనం తక్కువగా ఉండేదని, ఓడిపోతుంటే తట్టుకునేవాడు కాదని చెప్పాడు. 

‘‘రవిశాస్త్రికి ఓపిక తక్కువ. ఎవరైనా సరిగా ఆడకపోతే అసహనం వ్యక్తం చేసేవాడు. ఆయన అనుకున్న విధంగా బ్యాటింగ్‌ చేయలేకపోవడం, బంతులను సంధించకపోతే అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. అయితే ఎలా ఆడాలో కూడా నెట్స్‌లో విభిన్నంగా ఆడటం చూపించేవాడు. తన జట్టు నుంచి ఏం కావాలో దానిని ఆశించేవాడు. ఏ విధంగా ఆడినా ఫలితం మాత్రం మనకు అనుకూలంగా రావాలని చెప్పేవాడు. పరాజయంపాలైతే రవిశాస్త్రిలో ఓర్పు నశించేది. అయితే ఆటగాళ్లను బాగా ఆడేందుకు ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. కోచ్‌గా ప్లేయర్లలోని టాలెంట్‌ వెలికి తీయడంలో సిద్ధహస్తుడే. అనుకున్న దానికంటే ఎక్కువగానే ఫలితాలను రాబట్టాడు’’ అని కార్తిక్‌ వివరించాడు. ప్రస్తుతం రాహుల్-రోహిత్ కాంబినేషన్‌లో తానెంతో రిలాక్స్‌గా అనుభూతి చెందుతున్నట్లు కార్తిక్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని