Asia cup 2023 winner: ఆసియా కప్ విజేత టీమ్ ఇండియా
వన్డే ప్రపంచకప్ ముందు టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్-2023ను సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ ముందు టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్-2023ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఎనిమిదోసారి ఆసియాకప్‌ను దక్కించుకుంది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (6/21) శ్రీలంక బ్యాటింగ్ వెన్ను విరగొట్టిన వేళ 50 పరుగులకే లంకేయులు కుప్పకూలారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (27*; 19 బంతుల్లో 6 ఫోర్లు), ఇషాన్ కిషన్ (23*; 18 బంతుల్లో 3 ఫోర్లు) వికెట్ కోల్పోకుండా భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల దెబ్బకు 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. టీమ్‌ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ (6/21) ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ కొట్టాడు. ఇదే క్రమంలో వన్డేల్లో తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. ఆసియా కప్‌లో అతడికిదే బెస్ట్ బౌలింగ్ కావడం విశేషం. శ్రీలంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (17) టాప్ స్కోరర్ కావడం గమనార్హం. ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. కుశాల్ పెరీరా, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ, డాసున్ శనక, పతిరన పరుగులేమీ చేయలేదు. మిగిలినవారిలో పాథుమ్ నిశాంక (2), ధనంజయ డిసిల్వా (4), దునిత్ వెల్లలాగె (8) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో దుషాన్ హేమంత (13*) కాస్త పరుగులు చేయడంతో శ్రీలంక స్కోరు ఆమాత్రమైనా చేయగలిగింది. దీంతో భారత్ ఎదుట 51 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది. సిరాజ్ 6 వికెట్లు.. హార్దిక్ పాండ్య మూడు, బుమ్రా ఒక వికెట్ తీశారు.
మరిన్ని రికార్డులు..
- రోహిత్ శర్మ సారథ్యంలో భారత్‌కిది రెండో టైటిల్. 2018లోనూ (బంగ్లాదేశ్‌తో ఫైనల్) హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా ఆసియా కప్ సాధించింది.
- భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్ సిరాజ్. అతడి కంటే ముందు స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) ఉన్నారు.
- వన్డే ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత తక్కువ స్కోరు (50) నమోదు చేసిన జట్టుగా శ్రీలంక చెత్త రికార్డును సాధించింది. గతంలో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే భారత్ 54 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇప్పుడా రికార్డును శ్రీలంకనే తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.
- వన్డేల్లో శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇప్పుడు భారత్‌పై 50 పరుగులకు ఆలౌటైన లంక.. 2012లో దక్షిణాఫ్రికాపై 43 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్ (2023) మీద త్రివేండ్రం వేదికగా 73 పరుగులే చేసింది.
- వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన సిరాజ్.. ఆసియా కప్‌లోనూ రెండో బెస్ట్ ప్రదర్శన కావడం విశేషం. శ్రీలంక మాజీ బౌలర్ అజంత మెండిస్ (6/13) తర్వాత సిరాజ్ 6/21 స్పెల్‌తో రెండో స్థానంలో నిలిచాడు.
- ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లను భారత పేసర్లే తీయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Virat Kohli: హఠాత్తుగా ముంబయి వెళ్లిన విరాట్ కోహ్లీ.. కారణమిదేనా..?
-
Delhi: దేశ రాజధానిలో మోస్ట్‌వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్..!
-
TDP: దిల్లీలో నారా లోకేశ్.. రాజమహేంద్రవరంలో భువనేశ్వరి నిరశన దీక్ష
-
Nara Lokesh: విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసా?: లోకేశ్
-
TDP: మాజీ మంత్రి బండారు ఇంటికి తెదేపా ముఖ్యనేతలు
-
Gandhi Jayanti: మహాత్ముడి బోధనలు.. మన మార్గాన్ని వెలిగించాయి: గాంధీజీకి ప్రముఖుల నివాళి