IND vs BAN: బంగ్లాతో టెస్టు సిరీస్‌కు వేళాయే.. భారత్ సత్తా చూపేనా..?

వన్డే సిరీస్‌ పోయింది. కనీసం రెండు టెస్టుల సిరీస్‌ను అయినా గెలిచి తిరిగి రావాలని టీమ్‌ఇండియాను అభిమానులు కోరుతున్నారు. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది.

Updated : 13 Dec 2022 16:04 IST

ఇంటర్నెట్ డెస్క్: పసికూన అనుకొంటే బెబ్బులిలా రెచ్చిపోయి బలమైన టీమ్‌ను ఓడించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. తాజాగా మరో సిరీస్‌ కోసం సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఆ రెండు జట్లు ఏంటో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందిగా.. ఒకటి టీమ్‌ఇండియా కాగా.. మరొకటి బంగ్లాదేశ్‌. బుధవారం నుంచి భారత్-బంగ్లా మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 

గాయాల బాధ వెంటాడుతున్న టీమ్‌ఇండియాను రాహుల్ ద్వయం ఎలా ముందుకు తీసుకెళ్తుందేమోనని అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఎందుకంటే రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ వేలి గాయంతో తొలి టెస్టుకు దూరం కాగా.. రెండో మ్యాచ్‌కూ అందుబాటులో ఉండటమూ అనుమానమే. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించగా.. అతడికి డిప్యూటీగా ఛెతేశ్వర్ పుజారా వచ్చాడు. మరోవైపు షమీ, బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు లేరు. అయినప్పటికీ బౌలింగ్‌లోనూ ఉమ్రాన్‌ మాలిక్, ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్ ఉండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్, పుజారా, రాహుల్, పంత్‌తో బ్యాటింగ్‌లోనూ టీమ్‌ఇండియా బలంగానే ఉంది. మరోవైపు బంగ్లాదేశ్‌ కూడా తొలి టెస్టుకు జట్టును ప్రకటించింది. షకిబ్‌ సారథ్య బాధ్యతలను చేపట్టాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. 

మ్యాచ్‌లు ఇలా.. 

మొదటి టెస్టు మ్యాచ్‌: డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 18 వరకు

రెండో టెస్టు మ్యాచ్‌: డిసెంబర్‌ 22 నుంచి డిసెంబర్ 26 వరకు

జట్ల వివరాలు: 

భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, అభిమన్యు ఈశ్వరన్, నవ్‌దీప్‌ సైని, సౌరభ్‌ కుమార్, జయ్‌దేవ్‌ ఉనద్కత్

బంగ్లాదేశ్‌: మహముదుల్‌ హసన్, నజ్ముల్ హోస్సేన్, మోమినల్‌ హక్, యాసిర్‌ అలీ, ముష్ఫికర్‌ రహీమ్, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్, నురుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ఖలిద్‌ అహ్మద్, ఎబాడట్‌ హోస్సేన్, షోరిఫుల్ ఇస్లామ్, జకీర్ హసన్, రేజార్‌ రెహ్మాన్, అనముల్‌ హక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని