India vs Srilanka: గబ్బర్‌ జట్టుపై భువీ సేనదే విజయం

శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసుకు టీమ్‌ఇండియా వేగంగా సిద్ధమవుతోంది. ఆటగాళ్లు ప్రతిరోజూ మైదానంలో కఠోరంగా సాధన చేస్తున్నారు. సోమవారం సాయంత్రం భారత జట్టు రెండుగా విడిపోయి సన్నాహక మ్యాచ్‌ ఆడింది. ధావన్‌ -XIతో భువనేశ్వర్‌-XI తలపడింది...

Updated : 06 Jul 2021 11:13 IST

అర్ధ శతకాలు బాదేసిన మనీశ్‌, సూర్యకుమార్‌

కొలంబో: శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసుకు టీమ్‌ఇండియా వేగంగా సిద్ధమవుతోంది. ఆటగాళ్లు ప్రతిరోజూ మైదానంలో కఠోరంగా సాధన చేస్తున్నారు. సోమవారం సాయంత్రం భారత జట్టు రెండుగా విడిపోయి సన్నాహక మ్యాచ్‌ ఆడింది. ధావన్‌ -XIతో భువనేశ్వర్‌-XI తలపడింది. ఉత్సాహభరితంగా సాగిన ఈ పోరులో భువీ సేనదే విజయం.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ధావన్‌-XI 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే 45 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 30+ పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ప్రత్యర్థి సారథి భువనేశ్వర్‌ 4 ఓవర్లు విసిరి 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడం గమనార్హం. ఆ తర్వాత ఛేదనకు దిగిన భువీ సేన 17 ఓవర్లలోనే విజయం సాధించింది.  పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌ 60 పరుగుల విలువైన ఓపెనింగ్‌ భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన శైలిలో చెలరేగి అర్ధ శతకం బాదేశాడు.

తేమతో కూడిన వాతావరణంలో ఆటగాళ్లు తలపడిన విధానం బాగుందని బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మహంబ్రే అన్నాడు. భువీ సేన త్వరగా లక్ష్యం ఛేదించడంతో లక్ష్యం సవరించామని తెలిపాడు. 4 ఓవర్లలో 40 పరుగుల లక్ష్యం నిర్దేశించామని వెల్లడించాడు. పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేందుకు ఇలా చేశామని పేర్కొన్నాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని