IND vs PAK: పాక్‌తో తలపడాలంటే.. టీమ్‌ఇండియా ఒత్తిడికి గురవుతుంది : ఇంజమామ్‌

బలమైన బ్యాటింగ్ లైనప్‌ ఉన్నా.. పాకిస్థాన్‌ జట్టుతో తలపడాలంటే టీమ్‌ఇండియా ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారని ఆ దేశ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌-ఉల్‌-హక్‌ అన్నాడు. ఆ ఒత్తిడి కారణంగానే..

Updated : 26 Nov 2021 15:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బలమైన బ్యాటింగ్ లైనప్‌ ఉన్నా.. పాకిస్థాన్‌ జట్టుతో తలపడాలంటే టీమ్‌ఇండియా ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారని ఆ దేశ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌-ఉల్‌-హక్‌ అన్నాడు. ఆ ఒత్తిడి కారణంగానే టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో.. భారత్ ఓటమి పాలైందని పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

‘భారత్‌, పాక్ జట్లు తలపడుతున్నాయంటే.. సహజంగానే ఇరు జట్ల కెప్టెన్లు కొంత ఒత్తిడికి గురవుతుంటారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ టాస్‌ సమయంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌, టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బాడీ లాంగ్వేజ్‌ను గమనిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నా.. టాస్‌ ఓడిపోవడంతో విరాట్‌ కోహ్లి కొంత గందరగోళానికి గురయ్యాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా టీమ్‌ఇండియా మెరుగైన ప్రదర్శన చేసింది. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ, ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్ ఒత్తిడిని అధిగమించలేక వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. దీంతో ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌ తొలిసారిగా పాక్‌ చేతిలో ఓడిపోయింది. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఓటమి నుంచి తేరుకోలేకపోయారు. అందుకే, న్యూజిలాండ్‌తో జరిగిన తర్వాతి మ్యాచ్‌లోనూ భారత్‌ ఓడిపోయింది’ అని ఇంజమామ్‌ అన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని