IPL:ఇంగ్లాండ్ చేరుకున్న ఆటగాళ్లు..

బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది వరుసగా కరోనా బారినపడుతుండటంతో  ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Published : 05 May 2021 22:06 IST

లండన్‌: బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది వరుసగా కరోనా బారినపడుతుండటంతో  ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ, ఐపీఎల్‌లు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశాలకు తిరుగు పయనం అవుతున్నారు. జానీ బెయిర్ స్టో, జోస్‌ బట్లర్‌, సామ్‌ బిల్లింగ్స్‌, క్రిస్ వోక్స్, మొయిన్‌ అలీ, జేసన్‌ రాయ్, సామ్ కరన్, టామ్‌ కరన్‌ బుధవారం లండన్‌కు చేరుకున్నారు. వీరు ప్రభుత్వం గుర్తించిన హోటళ్లలో క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఇయాన్ మోర్గాన్, డేవిడ్ మలన్‌, క్రిస్ జోర్డాన్ రెండు రోజుల్లో భారత్‌ను వీడనున్నారు.


మరోవైపు, భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చే ప్రయాణికులపై ఆ దేశ ప్రభుత్వం మే 15 వరకు నిషేధం విధించింది. ఈ నిషేధం ఆస్ట్రేలియా పౌరులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. భారత్‌లో ఉండిపోయిన ఆసీస్‌ ఆటగాళ్లతో ఇతర దేశాల క్రికెటర్లతోపాటు వివిధ విభాగాలకు చెందిన వారిని  వీలైనంత త్వరగా వారి స్వదేశాలకు చేర్చేందుకు బీసీసీఐ అధికారులు  ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని