ఆర్చర్‌ చేతికి శస్త్రచికిత్స

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌కు సోమవారం శస్త్రచికిత్స జరగనుంది. ఆ తర్వాత కొన్ని వారాల పాటు అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు. టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌కు అతడు  అందుబాటులో...

Published : 27 Mar 2021 20:09 IST

పుణె: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌కు సోమవారం శస్త్రచికిత్స జరగనుంది. ఆ తర్వాత కొన్ని వారాల పాటు అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు. టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌కు అతడు  అందుబాటులో లేని సంగతి తెలిసిందే.

ఆర్చర్‌ కోహ్లీసేనతో రెండు టెస్టులు, ఐదు టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 4, పొట్టి క్రికెట్లో 7 వికెట్లు తీశాడు. నిజానికి భారత పర్యటనకు ముందే అతడి చేతికి గాయమైంది. ఈసీబీ వైద్య బృందం పర్యవేక్షించడంతో అతడు క్రికెట్‌ ఆడగలిగాడు.

టీ20ల తర్వాత ఆర్చర్‌ కుడి మోచేతికీ గాయం కావడంతో వన్డేలకు విశ్రాంతినిచ్చారు. మంగళవారమే బ్రిటన్‌కు చేరుకున్న అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్కానింగ్‌ తీసిన తర్వాత నిపుణులు ఆర్చర్‌కు శస్త్రచికిత్స అవసరమని సూచించారు. దీర్ఘ కాలికంగా ఆలోచిస్తే శస్త్రచికిత్సే మంచిదని వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని