SA vs IND: కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ సెంచరీ.. భారత్ తొలి ఇన్నింగ్స్‌ 245/10

 దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత మొదటి ఇన్నింగ్స్‌ ముగిసింది. కేఎల్ రాహుల్‌ సెంచరీ (101) సాధించి కీలక పాత్ర పోషించాడు.

Updated : 27 Dec 2023 15:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న (SA vs IND) తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్‌ బ్యాటర్ కేఎల్ రాహుల్ (101: 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. ఓవర్‌నైట్‌ 208/8 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా దూకుడుగా ఆడింది. మరీ ముఖ్యంగా కేఎల్ రాహుల్‌ ఆఖర్లో వేగంగా పరుగులు చేశాడు. కేవలం 8.4 ఓవర్లలో చివరి రెండు వికెట్లను కోల్పోయిన భారత్‌ 37 పరుగులు చేసింది. అందులో కేఎల్‌ రాహులే 31 రన్స్‌ సాధించడం గమనార్హం. రాహుల్‌ టెస్టు కెరీర్‌లో ఇది ఎనిమిదో శతకం. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (38),  శ్రేయస్‌ అయ్యర్ (31), శార్దూల్ ఠాకూర్ (24) కాస్త ఫర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడ 5, బర్గర్ 3.. జాన్‌సెన్‌, కోయిట్జీ చెరో వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు