FIFA World Cup: మేం సపోర్ట్‌ చేసే జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి: కేఎల్‌ రాహుల్‌

ఫిఫా ప్రపంచకప్‌లో మేం మద్దతిచ్చే జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయని, కాబట్టి ఫైనల్‌ మ్యాచ్‌ని వీక్షిస్తూ మంచి భోజనం లాగించేస్తామని టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌ అన్నాడు. 

Published : 18 Dec 2022 17:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా 188 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు మైదానంలో అలసిపోయిన భారత క్రికెటర్లు ఆదివారం జరిగే ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ని వీక్షించడానికి సిద్ధమవుతున్నారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ తుదిపోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్‌ తలపడనున్నాయి. ఫిఫా ఫైనల్‌ మ్యాచ్‌ గురించి టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌ మాట్లాడాడు. అర్జెంటీనా, ఫ్రాన్స్‌ జట్లలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో భారత జట్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయని పేర్కొన్నాడు. అయితే, మేం సపోర్ట్ చేసే జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్కమించాయని వివరించాడు. 

‘వరుసగా ఐదు రోజులు మ్యాచ్‌ ఆడటంతో అలసిపోయాం. ఈ రోజు రాత్రి ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ని చూసుకుంటూ రిలాక్స్ అవుదామనుకుంటున్నాం. మన జట్టులో ప్రతి ఒక్కరికి ఫుట్‌బాల్‌ అంటే ఇష్టం. వార్మప్‌ చేసే సమయంలో మేం చాలాసార్లు ఫుట్‌బాల్‌ ఆడాం. మీరు కూడా చూసే ఉంటారు.  మేం ఏ జట్లకైతే మద్దతు ఇస్తున్నామో అవి ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయనుకుంటా. మాలో కొంతమంది బ్రెజిల్ అభిమానులు, కొంతమంది ఇంగ్లాండ్ అభిమానులు ఉన్నారు. అర్జెంటీనా లేదా ఫ్రాన్స్ మద్దతుదారులు ఎవరో నాకు తెలియదు. కాబట్టి.. మ్యాచ్‌ని చూసి ఎంజాయ్‌ చేస్తాం అంతే. మేమంతా కలిసి మ్యాచ్‌ని వీక్షించి మంచి భోజనం లాగించేస్తాం’ అని తొలి టెస్టు మ్యాచ్‌ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో రాహుల్‌ పేర్కొన్నాడు. ఇక, బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు డిసెంబరు 22న ప్రారంభంకానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని