KKR vs LSG: లఖ్‌నవూ భవితవ్యం నేడు తేలేనా..? వరుణుడు అనుగ్రహించేనా..?
ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) లఖ్‌నవూ, కోల్‌కతా (KKR vs LSG) తమ చివరి మ్యాచ్‌ను ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లఖ్‌నవూకు ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు అవుతుంది. వర్షం వల్ల రద్దు అయినా లఖ్‌నవూకు అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించి బెర్తును ఖరారు చేసుకోవాలని లఖ్‌నవూ ఊపు మీదుండగా.. భారీ గెలుపుతో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంతో టోర్నీని ముగించాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ భావిస్తోంది.
ప్రస్తుతం లఖ్‌నవూ 15 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్‌లో గెలిస్తే 17 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడినా అవకాశాలు ఉన్నాయి. కానీ, అది ముంబయి, బెంగళూరు జట్ల ఫలితాలపై ఆధార పడి ఉంది. ఇరు జట్లూ తమ చివరి మ్యాచుల్లో ఒక్క టీమ్ ఓడినా లఖ్‌నవూకు బెర్తు ఖాయం. కానీ, ఇది తేలాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి. అలా కాకుండా ప్లేఆఫ్స్ భవిష్యత్తుపై ఇవాళ స్పష్టత రావాలంటే గెలిచి తీరాలి. అయితే, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేసినా ఇక్కట్లు తప్పవు. గత మ్యాచ్‌లో చెన్నైను వారి సొంత గడ్డపైనే కోల్‌కతా ఓడించింది. ఇవాళ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో కావడంతో కోల్‌కతాను ఆపడం అంత తేలికేం కాదు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలిస్తే 14 పాయింట్లతో ఏడో స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. అదీనూ, ముంబయి మ్యాచ్ ఫలితంపై ఆధార పడి ఉంది.
హార్డ్ హిట్లర్ మధ్య పోటీ
రెగ్యులర్ సారథి కేఎల్ రాహుల్ లేకపోయినా.. కృనాల్ పాండ్య నాయకత్వంలో లఖ్‌నవూ అద్భుత విజయాలను సాధించింది. ఆ జట్టులో కేల్ మయేర్స్, డికాక్, మార్నస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు. మ్యాచ్‌ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా మలుపు తిప్పగలరు. వరుణ్ చక్రవర్తి, శార్దూల్, సునీల్ నరైన్, సుయాశ్ శర్మతో కూడిన కోల్‌కతా బౌలింగ్ దళాన్ని ఆడటంపైనే లఖ్‌నవూ విజయావకాశాలు ఉన్నాయి. అలాగే కోల్‌కతాలోనూ జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్, గుర్బాజ్ దూకుడుగా ఆడటంలో సిద్ధహస్తులు. ఇరు జట్ల బ్యాటింగ్ విభాగాల్లో ఏది రాణిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వరుణుడు కరుణించేనా..?
గత రాత్రి కోల్‌కతాలో వర్షం పడటంతో మ్యాచ్ జరగడంపై అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. తమ మైదానంలో చివరి లీగ్ మ్యాచ్‌ను చూడాలనే ఆశ నెరవేరుతుందో లేదోనని ఆందోళనతో ఉన్నారు. అయితే, మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని వాతావరణ శాఖ చెప్పడం ఊరటనిచ్చే అంశం. మ్యాచ్ సమయానికి వాన పడే అవకాశాలు చాలా తక్కువని పేర్కొంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే, లఖ్‌నవూ ఖాతాలో ఒక పాయింట్ వచ్చి చేరుతుంది. అప్పుడు 16 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్ కారణంగా ఒక బెర్తు ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు
-
Movies News
Vishwak Sen: అందుకే పేరు మార్చుకున్నా: విశ్వక్ సేన్
-
World News
Ukraine: జెలెన్స్కీ ఇంటి ఎదుట ‘నాటు-నాటు’ పాటకు దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
India News
Train Accident: ‘కోరమాండల్’ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు