Shane Warne : వావ్‌.. బంతిని ఇలా కూడా తిప్పేస్తారా?

దిగ్గజ లెగ్ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ (52) మరణ వార్తను అభిమానులు ఇంకా.. 

Published : 06 Mar 2022 01:24 IST

షేన్‌ వార్న్‌ టాప్‌-5 వికెట్లు మీకోసం..

ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ లెగ్ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ (52) మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన క్రికెటర్ లేని లోటు తీర్చలేనిదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే షేన్‌ వార్న్‌ను లెజండరీ లెగ్‌ స్పిన్నర్‌గా మార్చిన టాప్‌-5 వికెట్ల ప్రదర్శనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. గింగిరాలు తిరుగుతూ బెయిల్స్‌ను గిరాటేసిన సూపర్‌ మ్యాజిక్ బంతులేంటో మనమూ ఓసారి చూసేద్దాం.. 

  • ఇంగ్లాండ్‌తో టెస్టులో షేన్‌ వార్న్‌ తన అద్భుతమైన స్పిన్‌తో బ్యాటర్‌ మైక్‌ గాట్టింగ్‌ నుంచి సమాధానం లేకుండా చేశాడు. లెగ్ స్టంప్‌కు ఆవల పడిన బంతి అనూహ్యంగా ఆఫ్‌ వికెట్‌ను తాకేసింది. బ్యాటర్‌ సహా అంపైర్ కూడా ఆశ్చర్యపోవడం గమనార్హం. 
  • లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ అయిన విండీస్‌ ఆటగాడు చంద్రపాల్‌కు వార్న్‌ సంధించిన బంతి అద్భుతం. దూరంగా పడిన బంతిని చంద్రపాల్‌ అడ్డుకునేందుకు విఫలయత్నం చేశాడు. బాల్‌ భారీగా టర్న్‌ అయి లెగ్‌ వికెట్‌ను  గిరాటేసింది. 
  • హెర్షలీ గిబ్స్‌ క్రీజ్‌లో ఉన్నాడంటే ఎంతటి బౌలర్‌ అయినా హడలెత్తాల్సిందే. అయితే అలాంటి గిబ్స్‌ను వార్న్‌ తన సూపర్‌ లెగ్‌ స్పిన్‌తో బోల్తా కొట్టించాడు. 1999 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచులో స్లో లెగ్‌ కట్టర్‌ బంతికి గిబ్స్‌ క్లీన్‌బౌల్డయ్యాడు. 
  • పాపం విండీస్‌ బ్యాటర్‌ పావెల్‌ మాత్రం వార్న్‌ బంతికి సమాధానం లేదు. ఆసీస్‌, విండీస్‌ టెస్టు మ్యాచ్ సందర్భంగా లెగ్ ఆవల వేసిన బంతిని పావెల్‌ ఆడేందుకు యత్నించాడు. అయితే బ్యాట్‌కు బంతి తాకలేదు. వైడ్‌గా పోతుందేమోనని భావించిన పావెల్‌కు షాక్‌.. గింగరాలు తిరుగుతూ ఠక్‌మని వికెట్లను పడేసింది. 
  • ఈసారి ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ అథెర్టన్ వంతు. లెగ్‌స్టంప్‌ ఇవతల బంతి పడితే వదిలేస్తే చాలు వికెట్‌ పడినట్లే. అంత కచ్చితంగా షేన్‌ వార్న్‌ సంధిస్తాడు. అథెర్టన్‌ కూడానూ ఇలానే బంతిని కొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక వెనక్కి చూసుకోకుండానే వికెట్‌ను చేజార్చుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని