Bumra-Wood: బుమ్రా స్పెషల్ స్కిల్‌ను.. ఇలా దోచేస్తా: మార్క్ వుడ్
మైదానంలో బరిలోకి దిగారంటే.. ఒకరిపై మరొకరు తమ అస్త్రాలను సంధించుకుంటారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు విసురుకుంటారు. అయితే స్టేడియం వెలుపల ...
ఇంటర్నెట్ డెస్క్: మైదానంలో బరిలోకి దిగారంటే.. ఒకరిపై మరొకరు తమ అస్త్రాలను సంధించుకుంటారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు విసురుకుంటారు. అయితే స్టేడియం వెలుపల తామంతా మంచి స్నేహితులమేనని క్రికెటర్లు చాటిచెబుతుంటారు. ఈ క్రమంలో టీమ్ఇండియా స్పెషల్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్‌తో సంభాషించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీనిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షేర్ చేసింది. భారత్, ఇంగ్లాండ్ జట్లు వార్మప్ మ్యాచ్‌లో తలపడ్డాయి కానీ.. గ్రూప్ స్టేజ్‌లో ఎదురపడలేదు. టీ20 ప్రపంచకప్‌లో జట్లన్నీ హోరాహోరీగా పోరాడాయి. చివరికి ఇంగ్లాండ్, ఆసీస్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి.
ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ బౌలర్లలో మార్క్‌వుడ్ ఒకడు. అయితే తన అమ్ములపొదిలోకి ఇంకో అస్త్రం కావాలట.. అదేంటంటే మన బుమ్రా వేసే స్పీడ్ యార్కర్ నైపుణ్యం. అయితే దాని కోసం హాలీవుడ్ మూవీ ‘స్పేస్ జంప్’ సూపర్పవర్తో బుమ్రా స్కిల్స్‌ను తస్కరిస్తానని మార్క్ వుడ్ చేసిన విన్యాసం భలేగా ఆకట్టుకుంది. దానికి బుమ్రా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సూపర్. దానినే ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మీరు మీ ప్రత్యర్థికి సంబంధించి ఏదైనా నైపుణ్యం దోచుకోవాలంటే ఎవరి నుంచి చేస్తావని మార్క్‌ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడుగుతాడు. దీనికి మార్క్‌వుడ్ సూపర్ సమాధానం ఇచ్చాడు. టీమ్ఇండియా స్పీడ్‌స్టర్ బుమ్రా పేరు చెప్పాడు. కేవలం ఐదు స్టెప్స్‌లో సరైన యార్కర్‌ను ఎలా సంధించాలనే స్కిల్‌ను తస్కరిస్తానని పేర్కొన్నాడు. అయితే మీరు ఎలా దోచుకుంటారు? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. మార్క్‌వుడ్ ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది. అదేంటో ఈ వీడియోలో మీరూ చూసేయండి...
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి