Corona: వాటిని తల్చుకుంటే భయమేస్తుంది 

ఇంగ్లాండ్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ మేఖేల్‌ వాన్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ తాజాగా కరోనా వైరస్‌బారిన పడటంతో గురువారం అతడు ఓ ట్వీట్‌ చేశాడు...

Published : 16 Jul 2021 01:43 IST

పంత్‌కు పాజిటివ్‌గా తేలడంపై మైఖేల్‌ వాన్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ తాజాగా కరోనా వైరస్‌బారిన పడటంపై ఇంగ్లాండ్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ మేఖేల్‌ వాన్‌  ట్విటర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశాడు.  ఐసోలేషన్‌ నిబంధనలు మారనంతవరకు ఆటగాళ్లు వైరస్‌ బారినపడుతుంటారని అభిప్రాయపడ్డాడు.

క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని, అందుకు పంత్‌ కేసే ఉదాహరణ అని పేర్కొన్నాడు. దాంతో త్వరలో జరగబోయే ‘ది హండ్రెడ్’‌, ‘భారత్‌xఇంగ్లాండ్‌’ జట్ల ఐదు టెస్టుల సిరీస్‌లపై ఆందోళన వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్‌ సిరీస్‌పైనా వైరస్‌ ప్రభావం చూపుంతుందని చెప్పాడు. బయోబుడగ, క్వారంటైన్‌ నిబంధనలు మారకపోతే క్రికెటర్లు ఆయా సిరీస్‌ల నుంచి తప్పుకునే ప్రమాదముందన్నాడు.

ఇదిలా ఉండగా, ఇటీవల యూకేలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు పూర్తయ్యాక పలువురు ఇంగ్లిష్‌ జట్టు ఆటగాళ్లు కూడా వైరస్‌బారిన పడ్డాడు. ఇక పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు బెన్‌స్టోక్స్‌ నేతృత్వంలో ద్వితీయశ్రేణి జట్టును ఎంపిక చేసి మ్యాచ్‌లు ఆడించింది. మరోవైపు తాజాగా పంత్‌కు పాజిటివ్‌గా తేలడంతో టీమ్‌ఇండియాలో కలవరం మొదలైంది. అయితే, అతడు ఇతర జట్టు ఆటగాళ్లను కలవకపోవడం ఊరట కలిగించే పరిణామం. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా వచ్చేనెల 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని