World Cup - NZ vs AFG: కివీస్‌తో మ్యాచ్‌.. సగం వికెట్లు కోల్పోయిన అఫ్గానిస్థాన్‌

ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ (Afghanistan) తడబడుతోంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్‌ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో ఆత్మరక్షణలో పడిపోయి నెమ్మదిగా ఆడుతోంది.

Updated : 18 Oct 2023 20:27 IST

చెన్నై: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ (Afghanistan) తడబడుతోంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్‌ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో ఆత్మరక్షణలో పడిపోయి నెమ్మదిగా ఆడుతోంది. 29 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 114 పరుగులే చేసి ఓటమి దిశగా సాగుతోంది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్‌ (11; 21 బంతుల్లో), ఇబ్రహీం జాద్రాన్ (14; 15 బంతుల్లో) ఎక్కువ సమయం క్రీజులో నిలవలేకపోయారు. తర్వాత వచ్చిన హష్మతుల్లా షాహిది (8; 29 బంతుల్లో) కూడా ఆకట్టుకోలేకపోయాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (27; 32 బంతుల్లో), రహమత్‌ షా (36; 62 బంతుల్లో) మాత్రమే నిలకడగా ఆడారు. ప్రస్తుతం ఇక్రమ్ (11*), మహ్మద్‌ నబీ (2*) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, మ్యాట్‌ హెన్రీ, ఫెర్గూసన్, రచిన్‌ రవీంద్ర ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని