CSK vs GT: పరిస్థితి ఎలా ఉన్నా.. అతడి వద్ద ఓ ప్లాన్ పక్కా!
గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్‌ను (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఐదో టైటిల్‌ను సొంతం చేసుకున్న జట్టుగా సీఎస్‌కే అవతరించింది. దీంతో సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) టైటిల్‌ను గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోపాటు ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను (CSK vs GT) మట్టికరింపిచి మరీ ఐదో కప్‌ను సీఎస్‌కే సొంతం చేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా మాజీ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు పోస్టులు పెట్టారు. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా గ్రామ్‌లో స్టోరీస్ పోస్టు పెట్టాడు.
‘‘సీఎస్‌కే జట్టుకు శుభాకాంక్షలు. ప్రతి పరిస్థితికి పక్కా ప్రణాళిక ఉండే ధోనీ నాయకత్వంలో ఐదోసారి కప్‌ను నెగ్గడం బాగుంది. చరిత్రాత్మక విజయంలో రవీంద్ర జడేజా తన అసాధారణ పోరాటంతో కీలక పాత్ర పోషించాడు’’ - ఎంకే స్టాలిన్ - తమిళనాడు ముఖ్యమంత్రి
‘‘అద్భుతమైన ఫైనల్ మ్యాచ్. సీఎస్‌కేకు కంగ్రాట్స్. చివరి వరకు పోరాడిన గుజరాత్ టైటాన్స్ వచ్చే సీజన్‌లో మరింత బలంగా రావాలి’’ - సుందర్ పిచాయ్, గూగుల్ సీఈవో
‘‘ఐపీఎల్ సీజన్‌కు అద్భుతమైన ముగింపు. రెండు జట్లూ (చెన్నై, గుజరాత్) విజయం కోసం అద్భుతంగా పోరాడాయి. చెన్నై లోతైన బ్యాటింగ్ ఆ జట్టును విజేతగా నిలిపింది. తొలి నుంచీ ఇరు జట్లూ సూపర్‌గా ఆడాయి. ఎంఎస్ ధోనీకి, సీఎస్‌కే జట్టుకు అభినందనలు’’ - సచిన్ తెందూల్కర్
‘‘సూపర్ విక్టరీ. జడేజా (జడ్డూ) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రాయుడు, రహానె, దూబె నుంచి మంచి భాగస్వామ్యం. మోహిత్ నాణ్యమైన బౌలింగ్ వేసినప్పటికీ.. అసాధారణ పరిస్థితుల్లోనూ ఎలా నెగ్గాలనేది సీఎస్‌కేకు తెలుసు. మరోసారి విజిల్ పోడు’’ - వీరేంద్ర సెహ్వాగ్
‘‘ఎంఎస్ ధోనీ అదృష్టజాతకుడు. వెల్‌డన్ సీఎస్‌కే. జడేజా బ్యాటింగ్ సూపర్బ్. రాయుడుకు అద్భుతమైన ముగింపు లభించింది’’ - ఇర్ఫాన్ పఠాన్
‘‘ఎలాంటి చరిత్ర లేకుండా బతికేయాలని భావించేవారికి ఎంఎస్ ధోనీ జీవితం ఓ గుణపాఠం. ఐదోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా మారిన సీఎస్‌కే జట్టుకు అభినందనలు. అనుభవ లేమి బౌలింగ్‌తో ఎలా నెట్టుకొస్తారని ఫిర్యాదులు చేసిన వారికి సరైన సమాధానం ఇచ్చాడు. కంగ్రాట్స్ ఎంఎస్ ధోనీ’’ - హర్భజన్ సింగ్
‘‘కంగ్రాట్స్ సీఎస్‌కే.. ఒక టైటిల్ గెలవడమే కష్టం. అలాంటిది ఐదుసార్లు విజేతగా నిలవడం నమ్మశక్యంకానిది’’ - గౌతమ్ గంభీర్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
-
Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్ గాంధీ
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!