Mark Boucher: ముంబయి జట్టు ప్రధాన కోచ్‌గా మార్క్‌బౌచర్‌..!

భారత టీ20 లీగ్‌లో ముంబయి జట్టుకు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజం మార్క్‌బౌచర్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి

Updated : 16 Sep 2022 13:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌లో ముంబయి జట్టుకు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజం మార్క్‌బౌచర్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న మహేల జయవర్థనేకు పదోన్నతి కల్పించి ఫ్రాంఛైజీ పెర్ఫార్మెన్స్‌కు గ్లోబల్‌ హెడ్‌గా నియమించింది. ముంబయి లీగ్‌ బ్రాండ్‌ను బలోపేతం చేసుకోవడానికి ఈ చర్యలు చేపట్టింది. మార్క్‌ నియామకం విషయాన్ని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మైదనం లోపల.. వెలుపల బౌచర్‌కు ఉన్న అనుభవం జట్టును విజయపథంలో నడిపిస్తుంది. జట్టుకు ఆయన అద్భుతమైన విలువను జోడిస్తాడు’’ అని పేర్కొన్నారు.

దీనిపై మార్క్‌ బౌచర్‌ స్పందించాడు. ‘‘ముంబయి జట్టుకు కోచ్‌గా నియమించడాన్ని గౌరవంగా భావిస్తాను. ఆ జట్టు సాధించిన విజయాలు, చరిత్ర కచ్చితంగా దాన్ని ప్రపంచంలో అత్యంత విజయవంతమైన క్రీడా ఫ్రాంఛైజీగా నిలుపుతోంది. నేను సవాళ్లు, ఫలితాలపైనే దృష్టిపెడతాను. ముంబయి గొప్ప ఆటగాళ్లతో కూడిన బలమైన జట్టు. దాని విలువను మరింత పెంచేందుకు కృషి చేస్తాను’’ అని బౌచర్‌ పేర్కొన్నాడు.

పంజాబ్‌కు కొత్త కోచ్.. 

టీ20 లీగ్‌లో పంజాబ్‌ ఫ్రాంచైజీకి కొత్త కోచ్ వచ్చాడు. అనిల్ కుంబ్లే స్థానంలో ప్రధాన కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌ని పంజాబ్ నియమించింది. ఇప్పటికే అనిల్ కుంబ్లే కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. 2012, 2014 సీజన్లలో కోల్‌కతాకు టైటిళ్లను అందించడంలో కోచ్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇయాన్‌ మోర్గాన్‌ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు 2019 వన్డే ప్రపంచకప్‌ను సాధించడం వెనుక బేలిస్‌ కోచింగ్‌ ప్రతిభ ఉంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని