Mumbai Indians: ముంబయి ఇండియన్స్‌లోకి కొత్త ఆటగాడు

ముంబయి ఇండియన్స్‌లోకి కొత్త ఆటగాడు వచ్చాడు. విష్ణు వినోద్ స్థానంలో సౌరాష్ట్ర వికెట్ కీపర్‌ బ్యాటర్ హార్విక్‌ దేశాయ్‌ (Harvik Desai)ని తీసుకుంది.

Published : 11 Apr 2024 17:52 IST

ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్‌లోకి కొత్త ఆటగాడు వచ్చాడు. వికెట్ కీపర్‌ బ్యాటర్ విష్ణు వినోద్ (Vishnu Vinod) ముంజేతి గాయం కారణంగా ఈ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో సౌరాష్ట్ర వికెట్ కీపర్‌ బ్యాటర్ హార్విక్‌ దేశాయ్‌ (Harvik Desai)ని ముంబయి ఇండియన్స్‌ తీసుకుంది. 24 ఏళ్ల హార్విక్ దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు బాదాడు. భారత్‌ 2018 అండర్-19 ప్రపంచకప్‌ను గెలిచిన జట్టులో హార్విక్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఆ ప్రపంచకప్‌లో విన్నింగ్ రన్స్‌ ఇతడే కొట్టాడు. 2023 సయ్యద్‌ ముస్తాక్ అలీ ట్రోఫీలో 175 స్ట్రైక్‌రేట్‌తో 336 పరుగులు చేశాడు. ముంబయి తరఫున విష్ణు వినోద్ గత సీజన్‌లో ఆకట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై 20 బంతుల్లో 30 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు గాయం కారణంగా వైదొలిగాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని