ఆస్ట్రేలియా కెప్టెన్సీకి ఓకే.. కానీ..: కమిన్స్‌

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోడానికి ఇష్టమేనని, అయితే తనకు అంత అనుభవం లేదని ఆ జట్టు పేసర్‌ పాట్‌ కమిన్స్‌ అన్నాడు. ఇటీవల ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ...

Updated : 04 Feb 2021 18:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోడానికి ఇష్టమేనని, అయితే తనకు అంత అనుభవం లేదని ఆ జట్టు పేసర్‌ పాట్‌ కమిన్స్‌ అన్నాడు. ఇటీవల ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా టీమ్‌ఇండియా చేతిలో ఓటమిపాలయ్యాక టిమ్‌పైన్‌ను టెస్టు కెప్టెన్‌గా తొలగించాలని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు కమిన్స్‌ ఇలా చెప్పుకొచ్చాడు. 

‘కచ్చితంగా సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతమైతే నాకు పెద్దగా అనుభవం లేదు. అయితే, ఇంగ్లాండ్‌లో రెండు సన్నాహక మ్యాచ్‌ల్లో.. అంతకుముందు అండర్-16 స్థాయిలో కెప్టెన్సీ చేశాను. కాబట్టి నేను కెప్టెన్సీ చేయడం అనే విషయం కచ్చితంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అది వైస్‌ కెప్టెన్‌గానూ నాకు ఉపయోగకరం. ఒకవేళ ఎప్పుడైనా టిమ్‌పైన్‌ లేదా ఆరోన్‌ఫించ్‌ లేని సమయంలో జట్టును నడిపించాల్సి వస్తే ఉపయోగపడుతుంది’ అని కమిన్స్ వివరించాడు. ఇదిలా ఉండగా, తాజాగా ఆస్ట్రేలియా టీమ్‌ వచ్చేనెలలో దక్షిణాఫ్రికాతో ఆడాల్సిన 3 టెస్టుల సిరీస్‌ను వాయిదా వేసుకుంది. అక్కడ కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందనే కారణంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆ జట్టు యాజమాన్యం పేర్కొంది.

ఇవీ చదవండి..
రైతులు మా దేశ అంతర్భాగం : కోహ్లీ
గబ్బా టెస్టులో అలా చేసిందెవరో తెలిసింది 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని