Mohammed Shami: షమీని పెళ్లి చేసుకోవడానికి రెడీ.. కానీ: బాలీవుడ్‌ నటి పోస్ట్‌ వైరల్‌

టీమ్‌ఇండియా పేసర్‌ షమీ (Mohammed Shami)ని తాను పెళ్లిచేసుకుంటానని బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ (Payal Ghosh) చేసిన పోస్ట్‌ నెట్టింట్‌ వైరల్‌ అవుతోంది.

Updated : 09 Nov 2023 11:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తాజాగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ టోర్నీ (ODI World Cup 2023)లో టీమ్‌ఇండియా పేసర్‌ షమీ (Mohammed Shami) మంచి జోరు మీదున్నాడు. ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా 16 వికెట్లు తీసి అదరగొట్టాడు. రెండు మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్లు తీసి అరుదైన ఘనత అందుకున్నాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడి బౌలింగ్‌కు బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ (Payal Ghosh) కూడా ఫిదా అయినట్లుంది. ఏకంగా అతడికి పెళ్లి ప్రతిపాదనే చేసేసింది.

‘‘షమీ (Mohammed Shami)ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అంటూ పాయల్‌ ఘోష్‌ (Payal Ghosh) ఇటీవల తన ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అయితే, ఇందుకు ఓ షరతు కూడా పెట్టిందండోయ్‌..! షమీ తన ఇంగ్లిష్‌ను మెరుగుపర్చుకుంటే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆమె పోస్ట్‌కు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ప్రేమకు భాషతో పనేంటి?’ అని కొందరు కామెంట్లు చేయగా.. ‘షమీ ఎలా స్పందిస్తాడో మరి’ అంటూ ఇంకొందరు ఫన్నీగా రాస్తున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

వసీమ్‌ వివరించాడు.. అయినా హసన్‌ అలా మాట్లాడేందుకు సిగ్గుండాలి: పాక్‌ మాజీపై షమీ నిప్పులు

బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలైన పాయల్‌ ఘోష్‌ మన తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో మంచు మనోజ్‌ నటించిన ‘ప్రయాణం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్‌.. ఆ తర్వాత పలు సినిమాల్లో కన్పించింది. ‘ఊసరవెల్లి’ సినిమాలో తమన్నాకు స్నేహితురాలి పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయిన పాయల్.. 2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం రామ్‌దాస్‌ అథవాలేకు చెందిన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.

ఇక షమీ 2014లో హసీన్‌ జహాన్‌ను వివాహం చేసుకోగా.. వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసుపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు