Rishabh Pant: లఖ్‌నవూతో మ్యాచ్‌లో.. రిషభ్‌ పంత్‌కు రూ.12 లక్షల జరిమానా

దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు భారీ జరిమానా పడింది. గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా టీ20 లీగ్‌ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు...

Published : 08 Apr 2022 11:14 IST

ముంబయి: దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు జరిమానా పడింది. గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా టీ20 లీగ్‌ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీ షా (61; 34 బంతుల్లో 9x4, 2x6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం లఖ్‌నవూ నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

అయితే, మైదానంలో తేమ కారణంగా దిల్లీ 150 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ క్రమంలోనే లఖ్‌నవూ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (80; 52 బంతుల్లో 9x4, 2x6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. చివర్లో ఉత్కంఠకు దారితీసినా.. ఆయుష్‌ (10 నాటౌట్‌) బదోని ఆ జట్టును గెలిపించాడు. మరోవైపు దిల్లీకి ఈ సీజన్‌లో ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. మొత్తంగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటే విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ముంబయిపై విజయం సాధించిన ఆ జట్టు తర్వాత గుజరాత్‌, లఖ్‌నవూ జట్లతో ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు