IPL 2024: రిషభ్‌ పంత్‌కు లైన్‌ క్లియర్‌.. ఆ ఇద్దరు పేసర్లు టోర్నీ మొత్తానికి దూరం

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న భారత స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. 

Published : 12 Mar 2024 13:30 IST

ఇంటర్నెట్ డెస్క్: 2022 డిసెంబరు చివరిలో టీమ్‌ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)  రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు దాదాపు 14 నెలలపాటు మైదానానికి దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న అతడు ఈసారి ఐపీఎల్‌ (IPL 2024)లో బరిలోకి దిగుతాడా? లేదా? అనే అనుమానాలు అభిమానుల్లో ఉండేవి. కానీ, వాటన్నింటికి ముగింపు పలుకుతూ బీసీసీఐ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఐపీఎల్- 2024 సీజన్‌కు పంత్ బ్యాటర్‌, వికెట్‌కీపర్‌గా పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు  ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. పంత్ త్వరలోనే దిల్లీ క్యాపిటల్స్‌ శిబిరంలో చేరనున్నాడు.

ఎడమ కాలి మోకాలుకు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ప్రసిద్ధ్‌ కృష్ణ, కుడికాలి చీలమండకు సర్జరీ చేయించుకున్న రికవరీ అవుతున్న మహ్మద్‌ షమి ఈ ఐపీఎల్ సీజన్‌ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్రసిద్ధ్ రాజస్థాన్‌ రాయల్స్‌కు, షమి గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరి స్థానాల్లో ఆ ఫ్రాంఛైజీలు ఎవరిని తీసుకుంటాయో చూడాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని