నా కరోనా టెస్టు రిపోర్ట్‌ రాలేదు: సైనా

భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ మరోసారి కరోనా బారిన పడ్డారని మీడియాలో వార్తలు రావడంతో ఆమె స్పందించారు. బ్యాంకాక్‌లో సోమవారం మూడోసారి నిర్వహించిన కొవిడ్‌-19 పరీక్షల ఫలితాలు...

Published : 12 Jan 2021 22:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ మరోసారి కరోనా బారిన పడ్డారని మీడియాలో వార్తలు రావడంతో ఆమె స్పందించారు. బ్యాంకాక్‌లో సోమవారం మూడోసారి నిర్వహించిన కొవిడ్‌-19 పరీక్షల ఫలితాలు(రిపోర్ట్‌) తనకందలేదని చెప్పారు. ఇదంతా గందర గోళంగా ఉందని ట్వీట్‌ చేశారు. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సందర్భంగా సైనా ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం వార్మప్‌ చేస్తుండగా తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు చెప్పారన్నారు. అలాగే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారన్నారు.

అయితే, నిబంధనల ప్రకారం కోవిడ్‌-19 టెస్టు చేసుకున్న ఐదు గంటల్లోనే రిపోర్టు రావాలని, 24 గంటలు గడుస్తున్నా తనకింకా ఆ ఫలితాలు అందలేదని సైనా బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌కు ట్వీట్‌ చేసింది. ఇదిలా ఉండగా, సైనా, ఆమె భర్త కశ్యప్‌ డిసెంబర్‌లో కరోనా బారిన పడ్డారు. వారిద్దరూ కొన్నిరోజులు ఆటకు దూరమై క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో డిసెంబర్‌ 27న తాము కరోనా నుంచి కోలుకున్నామని కశ్యప్‌ పేర్కొన్నారు. ఇప్పుడు సైనా మరోసారి వైరస్‌ బారిన పడ్డారని తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఏదేమైనా ఆమె క్షేమంగా ఉండాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

ఇవీ చదవండి..

నా మాటలతో తప్పుడు సంకేతాలిచ్చా.. 

‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని