wtc final: జడ్డూపై మంజ్రేకర్‌ కామెంట్స్‌

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మరోసారి రవీంద్ర జడేజా గురించి మాట్లాడాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అతడిని ఎంపిక చేయాల్సింది కాదన్నాడు. పేసర్లకు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో జడ్డూను తీసుకోవడం చేటు చేసిందని వివరించాడు.

Updated : 25 Jun 2021 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మరోసారి రవీంద్ర జడేజా గురించి మాట్లాడాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అతడిని ఎంపిక చేయాల్సింది కాదన్నాడు. పేసర్లకు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో జడ్డూను తీసుకోవడం చేటు చేసిందని వివరించాడు. అతడి స్థానంలో హనుమ విహారిని తీసుకుంటే బాగుండేదని అంటున్నాడు.

‘ఫైనల్‌ మ్యాచ్‌ ఆరంభానికి ముందు టీమ్‌ఇండియాను చూడండి. ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకోవడం ఎప్పటికీ చర్చనీయాంశమే. ఎందుకంటే సౌథాంప్టన్‌లో వాతావరణం చల్లగా ఉంది. ఆకాశం మేఘావృతమైంది. పైగా టాస్‌ ఒకరోజు ఆలస్యమైంది. కోహ్లీసేన ఒక ఆటగాడిని కేవలం బ్యాటింగ్‌ కోసమే తీసుకుంది. అతడే జడేజా. అతడిని ఎంపిక చేయడానికి ఎడమ చేతివాటం స్పిన్‌ అసలు కారణమే కాదు. అందుకే నేనీ నిర్ణయానికి వ్యతిరేకం’ అని సంజయ్‌ అన్నాడు.

‘జట్టులో ఎప్పుడైనా స్పెషలిస్టు ఆటగాళ్లనే ఎంపిక చేయాలి. వాతావరణం పొడిగా ఉండి, పిచ్‌ టర్న్‌ అవుతుంటే అశ్విన్‌తో పాటు ఎడమచేతి వాటం స్పిన్నరైన జడేజాను తీసుకుంటే అర్థముండేది. కేవలం బ్యాటింగ్‌ కోసమే అతడిని ఎంపిక చేశారు. నిజానికి ఈ నిర్ణయమే టీమ్‌ఇండియాను దెబ్బకొట్టింది! ఉదాహరణకు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ విహారిని తీసుకుంటే బంతిని డిఫెండ్‌ చేసేవాడు. టెక్నిక్‌ బాగుంటుంది. బహుశా 170 పరుగులు కాస్తా 220, 230గా మారేవేమో.. ఎవరికి తెలుసు! ఇంగ్లాండ్‌ సిరీసులో మాత్రం ఇలాంటి తప్పులు చేయొద్దు’ అని మంజ్రేకర్‌ సలహా ఇచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని