జకోవిచ్‌ను లొంగదీసుకుంటే డబ్బులిస్తామన్నారు!
ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్‌ను ప్రతిష్ఠను దెబ్బతీసే పనిచేయాలంటూ ఓ వ్యక్తి తనకు భారీ మొత్తం ఆఫర్ చేశాడని......
షాకింగ్ విషయాలు వెల్లడించిన సెర్బియా మోడల్
బెల్గ్రాడే: ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్‌ను లొంగదీసుకొని అతని ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేస్తే తనకు ఒక వ్యక్తి భారీ మొత్తం ఆఫర్ చేశాడని సెర్బియాకు చెందిన మోడల్ నటాలిజా స్కెకిక్ వెల్లడించింది. ఓ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టింది. లండన్‌కు చెందిన తనకు తెలిసిన వ్యక్తే ఈ ఆఫర్ చేశాడని తెలిపింది. జకోవిచ్‌తో శృంగారం చేసి దాన్ని చిత్రీకరిస్తే 60వేల యూరోలు, తాను అనుకున్న చోటకు ట్రిప్ వెళ్లేందుకు అవకాశం కల్పిస్తానని చెప్పాడని తెలిపింది. ‘‘లండన్‌కు చెందిన ఓ వ్యక్తి నన్ను సంప్రదించాడు. నా డేట్ అడిగితే ఏదో బిజినెస్ పనిమీదేమో అనుకున్నా. తీరా సెర్బియా బ్రాండ్ అంబాసిడర్ అయిన జకోవిచ్‌ను ప్రలోభపెట్టి దాన్ని చిత్రీకరించేందుకు డబ్బులు ఇస్తామనడాన్ని విని షాక్‌కు గురయ్యా. తొలుత ఏదో జోక్ చేస్తున్నారేమో అనుకున్నప్పటికీ ఆ మాట సీరియస్‌గానే అన్నట్టు గుర్తించా. చాలా బాధపడ్డా. అవమానకరంగా భావించి ఆ ఆఫర్‌ను తిరస్కరించా’’ అని చెప్పుకొచ్చింది. గదిలో రహస్య కెమెరా అమర్చి జకోవిచ్‌తో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను రికార్డుచేయమని అతనుకోరినట్టు ఆమె వెల్లడించింది.
‘ఆ మాట చెప్పిన క్షణమే అతడిని లాగి కొట్టాలని, అతడిపై నీళ్లు పోసేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ బహిరంగ ప్రదేశంలో ఉండటంతో నన్ను నేను నియంత్రించుకున్నా. సెర్బియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న జకోవిచ్ ఇమేజ్ను నాశనం చేయాలని ప్రయత్నించే ఈ ప్రతిపాదనను చూసి షాకయ్యా. అనంతరం నా వస్తువులను తీసుకొని అక్కడినుంచి బయటకు వచ్చేశా’’ అని నటాలిజా వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్‌స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్‌కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్‌లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్‌కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్‌పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్‌కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్‌ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్