pak vs eng: పాక్‌ జట్టును ఇరుకున పెట్టిన కోచ్‌ ప్రసంగం: వీడియో వైరల్‌

మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పాక్‌ బౌలింగ్‌ కోచ్‌ షాన్‌ టైట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Updated : 02 Oct 2022 16:06 IST

లాహోర్‌: హోరాహోరీగా సాగుతున్న ఏడు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్‌ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. గడాఫీ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఆరో టీ20లో 8 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్‌.. 3-3తో సిరీస్‌ను సమం చేసింది. ఈ మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పాక్‌ బౌలింగ్‌ కోచ్‌ షాన్‌ టైట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ‘ఏదైనా మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైతే మీడియా ముందుకు నన్ను పంపుతుంటారు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పీసీబీ సభ్యుడు ఒకరు కల్పించుకుని అతడిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ‘నువ్వు బాగానే ఉన్నావా?’ అంటూ మైక్‌ను కొన్ని సెకన్ల పాటు ఆపేశాడు. అనంతరం జట్టు ఓటమికి గల కారణాలను తెలియజేసిన షాన్‌ తన ప్రసంగాన్ని ముగించాడు. ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సొంత టీమ్‌ వైఫల్యాన్ని ఇలా మీడియా ముందు బయటపెట్టడంపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఓ సీనియర్‌ ఆటగాడు మాట్లాడుతుండగా అడ్డుకుని అవమానించారని పీసీబీ సభ్యుల తీరుపై మండిపడుతున్నారు. అయితే ఇరు జట్లకు సంబంధించిన నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌ ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని